Jade Lizard Options Strategy: Master Options Selling

Jade Lizard Options Strategy: Master Options Selling

What is the Jade Lizard Options Strategy?

Jade Lizard అనేది ఒక న్యూట్రల్ నుండి Bullish bias ఉన్న options selling స్ట్రాటజీ. సింపుల్ గా చెప్పాలంటే, మార్కెట్ పెద్దగా కదలదు లేదా కొంచెం పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. ఇందులో defined risk ఉంటుంది. అంటే, ఒక వైపు (పైకి వెళ్లే రిస్క్) మీ నష్టం ఎంత అనేది ముందుగానే తెలిసిపోతుంది. ఈ స్ట్రాటజీ ప్రధానంగా premium collection మీద ఆధారపడి ఉంటుంది. Stock Options లో కూడా దీన్ని వాడొచ్చు.

FinViraj - Jade Lizard Strategy

జేడ్ లిజార్డ్ అంటే ఏమిటి? ఇది ఒక వైపు రిస్క్ లేని ఆప్షన్ స్ట్రాటజీ. ఇందులో ఒక OTM పుట్ ఆప్షన్‌ను సెల్ చేస్తూనే, కాల్ సైడ్ ఒక ‘బేర్ కాల్ స్ప్రెడ్’ (Bear Call Spread) వేస్తాము.

దీని ప్రత్యేకత: మీరు పొందే మొత్తం ప్రీమియం, కాల్ సైడ్ స్ప్రెడ్ యొక్క వెడల్పు (Width) కంటే ఎక్కువగా ఉండేలా చూసుకుంటే, మార్కెట్ ఎంత పెరిగినా మీకు ఒక్క రూపాయి కూడా నష్టం రాదు.

ఎలా ఉపయోగించాలి?

  1. ఎంపిక: నిఫ్టీ స్పాట్ ధర ఎంటర్ చేస్తే కాలిక్యులేటర్ 3 లెగ్స్ ఇస్తుంది.

  2. ఎప్పుడు చేయాలి: మార్కెట్ కొంచెం బుల్లిష్‌గా లేదా సైడ్‌వేస్ లో ఉంటుందని అనుకున్నప్పుడు మరియు కాల్ సైడ్ ప్రీమియంలు తక్కువగా ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది.

ప్రాఫిట్ & స్టాప్ లాస్:

  • Target: మీ పెట్టుబడిపై 1.5% – 2% లాభం రాగానే నిష్క్రమించండి.

  • Stop Loss: మార్కెట్ భారీగా పడిపోయి, మీరు అమ్మిన పుట్ స్ట్రైక్ ధరను దాటి కిందకు వెళ్తుంటే ఎగ్జిట్ అవ్వాలి. కాల్ సైడ్ మార్కెట్ ఎంత పెరిగినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.


ముఖ్యమైన టిప్: దీనిని అమలు చేసేటప్పుడు, మీరు అమ్మిన పుట్ ఆప్షన్ ప్రీమియం మరియు కాల్ స్ప్రెడ్ ద్వారా వచ్చిన ప్రీమియం కలిపి, స్ప్రెడ్ గ్యాప్ (100 పాయింట్లు) కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ఉత్తమం.

ఈ స్ట్రాటజీ మూడు ఆప్షన్స్ ని కలిపి వాడటం ద్వారా పనిచేస్తుంది:

  1. Short Out-of-the-Money (OTM) Call Option: మీరు మార్కెట్ ఒక స్థాయికి మించి పెరగదని అనుకుంటారు కాబట్టి, ఆ స్థాయి పైన ఉన్న Call Option ని అమ్ముతారు.
  2. Short Out-of-the-Money (OTM) Put Option: మార్కెట్ ఒక స్థాయికి కింద పడదని అనుకుంటారు కాబట్టి, ఆ స్థాయి కింద ఉన్న Put Option ని అమ్ముతారు.
  3. Long Further Out-of-the-Money (OTM) Call Option: Short Call Option పైన ఉన్న ఇంకొక Call Option ని కొంటారు. ఇది upside risk ని define చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే, మార్కెట్ మీరు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ పెరిగినా, మీ నష్టం ఒక పరిధిలోనే ఉంటుంది.
guest
0 Comments
Inline Feedbacks
View all comments