Fundamental Analysis

Fundamental Analysis అంటే ఏమిటి?

సింపుల్ గా చెప్పాలంటే, Fundamental Analysis అంటే ఒక కంపెనీ ‘రియల్ వాల్యూ’ని తెలుసుకోవడం. మనం ఒక పండు కొంటున్నామనుకోండి, అది లోపల ఎలా ఉందో చూస్తాం కదా? అలాగే, ఒక కంపెనీ షేర్ కొనేటప్పుడు, ఆ కంపెనీ ఫైనాన్షియల్ గా ఎంత స్ట్రాంగ్ ఉందో, దాని బిజినెస్ మోడల్ ఏంటి, దాని మేనేజ్మెంట్ ఎలా ఉందో ఇవన్నీ స్టడీ చేయడమే Fundamental Analysis. దీనివల్ల మనకి ఆ షేర్ Intrinsic Value తెలుస్తుంది. మనం బయట చూసే ‘Price Movement’ కన్నా, కంపెనీ లోపల ఎంత విలువ ఉందనేది ముఖ్యం.

ఎందుకు Fundamental Analysis ముఖ్యం?

మీరు గుడ్డిగా ఇన్వెస్ట్ చేయకుండా, ఒక ప్లాన్ తో ముందుకు వెళ్ళడానికి Fundamental Analysis బాగా హెల్ప్ అవుతుంది. షార్ట్ టర్మ్ లో ‘Price Movement’ పైకి కిందకి అవుతున్నా, లాంగ్ టర్మ్ లో మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు కచ్చితంగా గ్రో అవుతాయి. ఇది మీ రిస్క్ ని తగ్గిస్తుంది. అంతేకాదు, సరైన కంపెనీని సరైన టైమ్ లో ఎంచుకోవడానికి కూడా ఇది చాలా ముఖ్యం.

Fundamental Analysis లో ముఖ్యమైన భాగాలు

ముఖ్యంగా మనం చూడాల్సినవి కొన్ని ఉంటాయి, అవేంటో చూద్దాం:

Financial Statements

కంపెనీ అకౌంట్స్ ని స్టడీ చేయడం చాలా ముఖ్యం. ఇవి మూడు రకాలు:

  • Balance Sheet: కంపెనీ దగ్గర ఏమున్నాయి (Assets), ఎంత అప్పు ఉంది (Liabilities), ఓనర్స్ డబ్బు ఎంత (Equity) అని చూపిస్తుంది.
  • Income Statement: కంపెనీ ఎంత ఆదాయం సంపాదిస్తుంది (Revenue), ఎంత ఖర్చు పెడుతుంది (Expenses), చివరకు ఎంత లాభం మిగులుతుంది (Profit) అని తెలుపుతుంది.
  • Cash Flow Statement: కంపెనీకి ఎంత నగదు వస్తుంది, ఎంత పోతుంది (Cash Flow) అని వివరంగా చూపిస్తుంది.

Financial Ratios

ఈ స్టేట్మెంట్స్ నుండి కొన్ని ముఖ్యమైన రేషియోలను లెక్కించడం ద్వారా కంపెనీ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది:

S.NoRatio
1Return on Capital Employed (ROCE)
2Sales Growth
3Profit Growth 5 Years
4Current Ratio
5Debt to Equity Ratio
6Price to Earnings (P/E) Ratio
7Promoter Holding
8Pledged Percentage
9PEG Ratio
10Operating Profit Margin
11Intrinsic Value
12Book Value
13Return on Equity
14Earnings Per Share (EPS)
15ROIC
16EVEBITDA
17Free Cash Flow
18Interest Coverage Ratio
19Debtor Days
20Earnings Yield
21Industry PE Ratio
22G Factor
23Graham Number
24FII Holding
25DII Holding
26Public Holding
27Face Value