Calendar Spreads: Master This Options Selling Strategy

Calendar Spreads: Master This Options Selling Strategy

What are Calendar Spreads?

సింపుల్ గా చెప్పాలంటే, Calendar Spread అనేది ఒక options strategy. ఇందులో మనం ఒకే Strike Price, ఒకే Underlying Asset, మరియు ఒకే Option Type (Call లేదా Put) తో రెండు options ని Buy, Sell చేస్తాం. కానీ వాటి Expiry Dates వేర్వేరుగా ఉంటాయి. అంటే, మీరు దగ్గర ఉన్న expiry option ని Sell చేసి, దూరం ఉన్న expiry option ని Buy చేస్తారు. చాలామంది దీన్ని Time Decay (Theta) ని ఉపయోగించుకుని Profit సంపాదించడానికి వాడతారు.

Why Calendar Spreads Are Popular?

మీరు గమనిస్తే, options value అనేది expiry దగ్గరికి వచ్చే కొద్దీ Time Decay అవ్వడం వల్ల తగ్గుతుంది. Calendar Spread లో, మనం దగ్గర ఉన్న expiry option ని sell చేస్తాం కాబట్టి, దాని Time Decay వేగంగా జరుగుతుంది. దూరం ఉన్న expiry option కి Time Decay తక్కువగా ఉంటుంది. ఈ తేడానే మన Profit కి మూలం. దీనివల్ల market ఒకే చోట ఉన్నా లేదా తక్కువగా కదిలినా Profit చేసుకోవచ్చు. అంతేకాకుండా, దీనికి Risk కూడా Fixed గా ఉంటుంది.

FinViraj - Calendar Spread Calculator

క్యాలెండర్ స్ప్రెడ్ అంటే ఏమిటి? ఒకే స్ట్రైక్ ధర ఉన్న రెండు ఆప్షన్లను వేరువేరు ఎక్స్‌పైరీలలో ట్రేడ్ చేయడాన్ని క్యాలెండర్ స్ప్రెడ్ అంటారు. సాధారణంగా దగ్గరి ఎక్స్‌పైరీని అమ్మి (Sell), దూరపు ఎక్స్‌పైరీని కొంటాము (Buy).

ఎందుకు వాడాలి?

  • Theta Decay: కాలం గడిచేకొద్దీ దగ్గరి ఎక్స్‌పైరీ ఆప్షన్ విలువ చాలా వేగంగా పడిపోతుంది. ఇది మనకు లాభం చేకూరుస్తుంది.

  • Low Risk: మనం ఆప్షన్‌ను కొని ఉంచుతాము కాబట్టి, మార్కెట్ భారీగా కదిలినా మన నష్టం పరిమితంగా ఉంటుంది.

ఎప్పుడు అమలు చేయాలి?

  • మార్కెట్ రేంజ్ బౌండ్ (Range-bound) లో ఉంటుందని భావించినప్పుడు ఇది బెస్ట్.

  • సాధారణంగా ఎక్స్పైరీ ముందు రోజు లేదా Expiry నాడు వీక్లీ ఎక్స్‌పైరీ కోసం దీనిని ప్లాన్ చేయవచ్చు.

ప్రాఫిట్ & స్టాప్ లాస్:

  • Target: పెట్టుబడిపై 2-4% లాభం రాగానే క్లోజ్ చేయండి.

  • Stop Loss: మార్కెట్ మీ స్ట్రైక్ ధర నుండి 1% కంటే ఎక్కువ దూరం కదిలినా లేదా అమ్మిన ఆప్షన్ ప్రీమియం కంటే కొన్న ఆప్షన్ ప్రీమియం విలువ వేగంగా పడిపోతున్నా ఎగ్జిట్ అవ్వాలి.

guest
0 Comments
Inline Feedbacks
View all comments