Bear Put Spread Strategy: Options Buying for Falling Markets

Bear Put Spread Strategy: Options Buying for Falling Markets

What is a Bear Put Spread?

Bear Put Spread అంటే, మీరు మార్కెట్ కొంచెం పడుతుంది అని ఆశిస్తున్నప్పుడు వాడే ఒక Options కాంబినేషన్ స్ట్రాటజీ. దీంట్లో మనం రెండు Put Options ని ఉపయోగిస్తాం:

  1. Higher Strike Price Put Option Buy: మీరు ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న మార్కెట్ ప్రైస్ (CMP) కన్నా కొంచెం ఎక్కువ స్ట్రైక్ ప్రైస్ ఉన్న ఒక Put Option ని కొంటారు.
  2. Lower Strike Price Put Option Sell: అదే ఎక్స్‌పైరీ లో, మీరు కొన్న Put Option స్ట్రైక్ ప్రైస్ కన్నా తక్కువ స్ట్రైక్ ప్రైస్ ఉన్న ఒక Put Option ని అమ్ముతారు.

ఇది ఒక options buying strategy. ముఖ్యంగా, మీరు మార్కెట్ భారీగా పడుతుందని కాకుండా, ఒక మోస్తారుగా తగ్గుతుందని భావించినప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. ఈ స్ట్రాటజీలో మీ మాగ్జిమమ్ లాస్ (Maximum Loss) లిమిటెడ్‌గా ఉంటుంది, అలాగే మాగ్జిమమ్ ప్రాఫిట్ (Maximum Profit) కూడా లిమిటెడ్‌గా ఉంటుంది. ఇది ఒక సేఫ్టీ నెట్ లాగా పనిచేస్తుంది అన్నమాట.

FinViraj - Bear Put Spread

Bear Put Spread

మార్కెట్ పడుతుందని భావించినప్పుడు ఒక పుట్ ఆప్షన్ కొని (Buy), అదే సమయంలో దాని కంటే తక్కువ స్ట్రైక్ ధర ఉన్న మరో పుట్ ఆప్షన్‌ను అమ్మడాన్ని (Sell) బేర్ పుట్ స్ప్రెడ్ అంటారు.

ముఖ్య పాయింట్లు:

  • తక్కువ పెట్టుబడి: మీరు అమ్మిన పుట్ వల్ల వచ్చే ప్రీమియం మీ కొన్న ఆప్షన్ ఖర్చును తగ్గిస్తుంది.

  • రిస్క్: మీరు చెల్లించిన ‘Net Premium’ కు మాత్రమే మీ నష్టం పరిమితం అవుతుంది.

  • టైమ్ డికే: కేవలం పుట్ కొంటే టైమ్ డికే వల్ల నష్టం వస్తుంది, కానీ ఈ స్ప్రెడ్ లో ఆ రిస్క్ చాలా తక్కువ.

ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి?

  • Target: మార్కెట్ మీరు అమ్మిన స్ట్రైక్ ప్రైస్ (Sell Strike) వరకు చేరితే మీకు గరిష్ట లాభం వస్తుంది.

  • Stop Loss: మార్కెట్ పడకుండా రివర్స్ లో పెరగడం మొదలైతే, మీ స్టాప్ లాస్ పాయింట్ వద్ద వెంటనే ట్రేడ్ క్లోజ్ చేయాలి.

guest
0 Comments
Inline Feedbacks
View all comments