Breakout Buying Strategy: Options Trading Secrets

Breakout Buying Strategy: Options Trading Secrets

What is Breakout Buying Strategy?

సింపుల్ గా చెప్పాలంటే, Breakout అనేది ఒక స్టాక్ లేదా ఇండెక్స్ ఒక నిర్దిష్ట Price level (దీనిని Support లేదా Resistance అంటాము) ని దాటి, కొత్త Highs లేదా Lows కి వెళ్ళినప్పుడు జరుగుతుంది. ఇక్కడ ‘Buying’ అంటే, ఆ Breakout జరిగిన వెంటనే Entry తీసుకొని, ఆ Momentum ని capitalize చేసుకోవడం. మనం చాలాసార్లు చూస్తుంటాం కదా, ఒక స్టాక్ చాలా రోజులు ఒకే రేంజ్ లో తిరిగి, ఆ తర్వాత ఒక్కసారిగా పైకి లేదా కిందకి వెళ్ళిపోతుంది. అలాంటి movement నే మనం Breakout అంటాం.

FinViraj - Breakout Buying Strategy

బ్రేక్అవుట్ బయింగ్ (Breakout Buying) – ఇన్స్ట్రక్షన్స్

బ్రేక్అవుట్ బయింగ్ అంటే ఏమిటి? మార్కెట్ చాలా సేపు ఒకే రేంజ్ లో ఉండి, ఒక ముఖ్యమైన స్థాయిని (Resistance or Support) దాటినప్పుడు వచ్చే పెద్ద కదలికను పట్టుకోవడమే ఈ వ్యూహం.

స్ట్రాటజీ రూల్స్:

  1. Time Frame: ఇంట్రాడే కోసం 5 నిమిషాలు లేదా 15 నిమిషాల చార్ట్ వాడాలి.

  2. Confirmation: కేవలం ప్రైస్ టచ్ అయితే సరిపోదు, ఆ లెవల్ పైన (లేదా కింద) ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి.

  3. ITM Selection: మనం ఎప్పుడూ In-The-Money (ITM) ఆప్షన్లనే ఎంచుకోవాలి. దీనివల్ల టైమ్ డికే తక్కువగా ఉండి, మూవ్‌మెంట్ వచ్చినప్పుడు లాభం ఎక్కువగా ఉంటుంది.

రిస్క్ మేనేజ్మెంట్:

  • Stop Loss: బ్రేక్అవుట్ క్యాండిల్ యొక్క లో (Low) లేదా సపోర్ట్ లెవల్ కి కొంచెం కింద మీ స్టాప్ లాస్ ఉండాలి.

  • Reward: కనీసం 1:2 రిస్క్-రివార్డ్ రేషియో మెయింటైన్ చేయాలి. అంటే 20 పాయింట్లు రిస్క్ తీసుకుంటే, 40 పాయింట్ల లాభం కోసం చూడాలి.

guest
1 Comment
Inline Feedbacks
View all comments
K Rama krishna

Thankyou for giving valuable information sir.